ఈ రోజైనా తెలుగులో మాట్లాడుదాం

updated: February 21, 2018 10:42 IST
ఈ రోజైనా తెలుగులో మాట్లాడుదాం

"శిశువు సౌందర్య దృష్టిని ,తన లోని

భావాలను,తన ఆనందానుభూతిని 

వ్యక్తం చేయడానికి ఉపయోగపడేది మాతృభాష" :  మహాత్మా   గాంధీ 

ఏ భాషను శిశువు అసంకల్పితంగా మాట్లాడుతాడో ,ఏ భాష ఇతర భాషల అభ్యసనంపై ప్రభావం చూపుతుందో ఆ భాషనే మాతృభాష అంటారు.  దీని ప్రాముఖ్యతని గుర్తించి  మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21 న జరుపుకుంటున్నాం. ఇది యునెస్కో సంస్థచే ప్రకటించబడింది. దీనికి కారణం  మాతృభాష కోసం నలుగురు బెంగాలీ యువకులు ప్రాణాలర్పించిన ఫిబ్రవరి 21 వ తేదీని ఐక్యరాజ్యసమితి 'అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం'గా ప్రకటించింది.  

ఈ సందర్భంగా యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ తన సందేశంలో ఇలా చెప్పారు: ‘ప్రపంచంలో మాట్లాడే భాషలన్నిటికంటే మనం మన వ్యక్తిగత ప్రపంచంలో ఏ భాషలో మాట్లాడతామో, ఏ భాషలో మన తల్లిదండ్రుల్ని అర్థం చేసుకుంటామో, ఏ భాషలో స్కూల్లో తోటి విద్యార్థులతో మాట్లాడతామో, ఆ భాష మన భావోద్వేగాల అభివృద్ధికీ, జ్ఞానాభివృద్ధికీ ఉపయోగపడటంలో గణనీయమైన పాత్ర నిర్వహిస్తుంది. మాతృభాషా దినోత్సవ ప్రకటన సదర్భంగా ప్రపంచంలోని అన్ని భాషలు సమానంగా గుర్తించబడ్డాయి. ప్రతి భాషా మానవ ప్రతిస్పందనల విశిష్టతలను కలిగి ఉంటుంది. ప్రతి భాషకు సంబంధించిన సజీవ వారసత్వాన్ని మనం అనుభవించాలి’ అని ఆయన ప్రకటించారు.

 "దేశ భాష లందు లెస్స తెలుగు భాష అని చక్రవర్తి, సాహితీ సార్వభౌములు శ్రీ కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద గ్రంథంలో తన ఇష్ట దైవమైన శ్రీ కాకుళాంధ్ర మహా విష్ణువుతో ఎంతో అందంగా చెప్పించారు.  కాబట్టి సుసంపన్నమైన మన భాషా సాహిత్య సౌందర్యాన్ని అవగాహన చేసుకోవడం,మన భాషను,సంస్కృతినీ కాపాడుకోవడం ,భావి తరాలవారికి  దీనిని అందించడం ఆ భాషా సౌందర్యసంపదను కాపాడటం  అందరి కర్తవ్యం. 

కాబట్టి ఈ రోజైనా మనం పూర్తి తెలుగులో మాట్లాడుదాం...తెలుగుని చదువుదాం..తెలుగుని గౌరవిద్దాం అని "తెలుగు 100" పిలుపు ఇస్తోంది

Disclaimer: The following shared video may not be part of Telugu100.com network. Sometimes we may give external links to strengthen the quality of the posts. In this case, Telugu100.com is not responsible for the content of the videos and the original owner would be responsible for the same.

Tags: telugu, tenugu

comments